Wednesday 24 October 2012

తాకట్టు జీవితాలు

కూడు-గూడు -గుడ్డ లేని 
నా సంపూర్ణ పేదరికానికి 
తలసరి ఆదాయం లెక్క కట్టి 
సాపేక్ష పేదరికం లో నన్ను చేరిస్తే 
నా ఆకలి అన్నార్త నాదాలు 
తీర్చే వారెవరు ఎవరికెరుక ?
తప్పుల తడకల ఆర్ధిక వ్యవస్థలో 
ఏసి ల్లో కూర్చుని ఇచ్చే జివో ల్లో
ఎండమావుల జీవితాలే కనిపిస్తాయి
ఆర్ధిక జీవన ప్రమాణాలు 
తెలీని నీ బొక్కల లెక్కలు 
మా రెక్కల తాకట్టు పెట్టే
నీ ప్రపంచ బ్యాంకుకే పనికొస్తాయి. 
ఈ పనికిమాలిన ప్రవచనాలు 
దగ్గరకొస్తే నిజాలు ఇజాలవుతాయి
రూపాయికి విలువలేని ఈ దేశంలో
క్రూరమైన విధి విధానాలకు 
కొదువలేదు
అశాస్త్రీయ ఆర్దికమే నీకు నిజం
ఒక్కసారి మా ఆకలి చవి చూడు 
డొక్కాడని మా రెక్కలు చూడు 
చిరిగిన చితికిన జీవితాలు 
కనిపిస్తాయి
(ఈ కవిత సేవ పత్రికలో ప్రచురితం )

No comments:

Post a Comment